KCR: నేడు ఎమ్మెల్యేగా KCR ప్రమాణం…

-

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆయన ఆహ్వానించారు. కొద్ది రోజుల క్రితం ఫామ్ హౌస్ లో కాలుజారి పడటంతో ఆయన అసెంబ్లీలో ప్రమాణం చేయలేకపోయారు. తుంటి ఎముక మార్పిడి సర్జరీ అనంతరం ఇటీవల కోలుకున్నారు. ఇవాళ స్పీకర్ సమక్షంలో ప్రమాణం చేస్తారు.

ఇవాళ మధ్యాహ్నం 12:45 నిమిషాలకు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు కేసీఆర్. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి చేరుకోనున్న కేసిఆర్…నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపి కార్యాలయం చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత ఎల్ఓపి నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు కేసీఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news