కేసీఆర్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ షురూ

-

రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై రేవంత్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనం ఎదుట ఇరుపక్షాల వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్గా, తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్దార్థ లూథ్రా. కమిషన్ తరఫున గోపాల్శంకర్ నారాయణన్ తమ వాదనలు వినిపించారు.

ఈ క్రమంలోనే ముకుల్ రోహతి తన వాదనలతో విరుచుకుపడ్డారు. పూర్తిగా రాజకీయ కక్షతోనే తన క్లయింట్పై కమిషన్ వేశారని ధర్మాసనానికి తెలిపారు. ఏదో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారి మాజీ సీఎంలపై కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉన్న విషయాన్ని ఆయన కోర్టుకు విన్నవించారు. రాష్ట్రంలో రైతాంగానికి నిరంతర విద్యుత్ సదుద్దేశంతోనే ఛత్తీస్గడ్ నుంచి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఆ ఒప్పందానికి ఇరు రాష్ట్రాలు కూడా ఆమోదం తెలిపాయంటూ బలంగా ముకుల్ రోహత్గా తన వాదనలు వినిపించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news