కేటీఆర్ అత్యవసర మీటింగ్… 14 మంది ఎమ్మెల్యేలు డుమ్మా?

-

కేటీఆర్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. అసెంబ్లీ స్పీకర్‌ ను కలిసేందుకు 14 మంది ఎమ్మెల్యేలు రాలేదు. ప్రోటోకాల్ ఉల్లంఘనల పై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు. అయితే.. ఇందులో 14 మంది బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే హజరు అయ్యారు. 14 మంది గైర్హాజరు అయ్యారు.

KTR

కేటీఆర్, హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, చింత ప్రభాకర్, మాణిక్ రావు, మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద, పద్మారావు గౌడ్, కాలేరు వెంకటేష్, మాధవరం కృష్ణారావు, మరి రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ముఠా గోపాల్ ఎమ్మెల్యేలు హజరు అయ్యారు.

గజ్వేల్ ఎమ్మెల్యే కెసిఆర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి , మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే – కొత్త ప్రభాకర్ రెడ్డి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే – కోవ లక్ష్మీ, బోధ్ ఎమ్మెల్యే – అనిల్ జాదవ్, ఆలంపూర్ ఎమ్మెల్యే,- విజేయిడు, హుజురాబాద్ ఎమ్మెల్యే – పాడి కౌశిక్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే – వేముల ప్రశాంత్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే – పల్లా రాజేశ్వర్ రెడ్డి గైర్హాజరు అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news