హైదరాబాద్‌ వాసులకు శుభవార్త…మెట్రో ఫేస్ 2పై పనులపై కీలక ప్రకటన

-

ఎన్ని అవరోధాలు వచ్చిన మెట్రో నిర్మాణం పూర్తి చేసి, విజయవంతంగా నడిపిస్తున్నామన్నారు మెట్రో ఎం డీ ఎన్.వి.యస్ రెడ్డి. మెట్రో ఫేస్ 2 మెట్రో నిర్మాణం కోసం ఫోకస్ పెట్టామని.. మెట్రో ఫేస్ 2 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మాణం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకు 5వేల కోట్లతోమెట్రో ఫేస్ 2 పెట్టుబడి పెట్టెందు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఈ ప్రాజెక్ట్ లో భాగస్వాములైయేందుకు ఎవరైనా ముందుకు రావచ్చన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ మెట్రో ద్వారా 3 వేల కోట్ల నష్టం వచ్చిందని… నష్టాలు వస్తున్న హైదరాబాద్ మెట్రో ను మధ్యలో వదిలి వేయకుండా ఎల్ అండ్ టీ నిర్వహణ చేస్తుందని పేర్కొన్నారు.

ఎల్.అండ్.టి లేకుంటే.. ప్రభుత్వా నికి 20 వేల కోట్లు భారం పడేదన్నారు. కరోనా తో హైదరాబాద్ మెట్రో రైల్ తీవ్రంగా నష్టపోయింది.. కరోనా కు ముందు రోజు కు 4 లక్షల మంది మెట్రో లో ప్రయాణించే వారన్నారు. ప్రస్తుతం రోజుకు 2.7లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారని.. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణపై కొందరు ఇష్టం వచ్చినంటూ మాట్లాడుతున్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news