రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. TSRTC పేరు మార్పు..!

-

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. TSRTC పేరును మార్చనుంది. TGSRTCగా మార్చాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. త్వరలో లోగోలో మార్పులు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే వాహనాలకు TS బదులుగా TG అని రిజిస్ట్రేషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణ లో వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లలో TS స్థానంలో TG ని అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇకనుంచి రాష్ట్రంలో కొత్త నంబర్ ప్లేట్లు TGతో జారీ కానున్నాయి. అయితే ఇది కొత్తగా వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. పాత వాహనాలు TSతో కొనసాగనున్నాయి. ఈ అంశంపై గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పుడు గెజిట్ జారీ చేయడంతో అధికారికంగా ఈ నిర్ణయం అమలు కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news