రైతు భరోసా పై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం..!

-

రైతుభరోసా  పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం అయింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు హజరైన ఈ భేటీలో రైతు భరోసా విధివిధానాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చ జరిగింది.


రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. జనవరి 5
నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైతు భరోసా విధి, విధానాలపై
ఎల్లుండి జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఫైనల్ నిర్ణయం తీసుకుని జనవరి 14వ తేదీ
నుంచి రైతు భరోసా అమలు చేయబోతున్నది. అయితే రైతు భరోసా విషయంలో ఇప్పటికే ప్రజలు,
వివిధ సంస్థల నుంచి ప్రభుత్వం పలు సూచనలను స్వీకరించిది. వీటిలో ప్రభుత్వం దేనిని ఆచరిస్తుందో తెలియాలంటే ఎల్లుండి వరకు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news