ఆటోలు, క్యాబ్ లు బుక్ అయ్యాక కాన్సిల్ చేస్తే…చర్యలు తప్పవు – పోలీసులు

-

ఆటోలు, క్యాబ్ లు బుక్ అయ్యాక కాన్సిల్ చేస్తే…చర్యలు తప్పవన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి. ఇవాళ రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు …కేబుల్ బ్రిడ్జి , ఔటర్ , ఫ్లైఓవర్ లు మూసివేస్తామని ప్రకటించేశారు. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకునే వారు…నిబంధనలకు లోబడి చేసుకోవాలని కోరారు. ప్రజలు సురక్షితంగా, కుటుంబ సభ్యుల సంతోషాన్ని దృష్టిలో పెట్టుకొని జరుపుకోవాలని కోరారు.

CP Avinash Mahanthi

పబ్లిక్ ప్లేస్ లలో సంబరాలు చేసుకునే వారు…చట్టానికి లోబడి చేసుకోవాలన్నారు. ఈ రాత్రి నుంచి కొన్ని ట్రాఫిక్ నిబంధనలు వుంటాయి..ఫ్లైఓవర్ లు మూసివేస్తాము..orr కూడా మూసి వేస్తామన్నారు. Air port కి వెళ్ళే వారు టికెట్ చూపించి orr లో వెళ్ళాలని స్పష్టం చేశారు. డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీలు ముమ్మరంగా చేస్తాము..బైక్ లపై ఫీట్ లు చేస్తూ..ప్రజలకు అసౌకర్యం కలిగించే వారి పట్ల కటినంగా వ్యవహరిస్తామని వివరించారు. డ్రగ్స్ సేవించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసాము… అర్ధ రాత్రి 1 గంట వరకు అన్ని కమర్షియల్ వాటికి అనుమతి ఇస్తున్నామని చెప్పారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి.

Read more RELATED
Recommended to you

Latest news