చంద్రబాబు స్కిల్ స్కాంపై ఎందుకు లేఖ రాయలేదు? – పవన్‌ కు జోగి రమేష్‌ కౌంటర్‌

-

చంద్రబాబు స్కిల్ స్కాంపై ఎందుకు లేఖ రాయలేదు? అని పవన్‌ కళ్యాణ్‌కు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కౌంటర్‌ ఇచ్చారు. నిన్న జగన్‌ సర్కార్‌ పై మోడీకి ఫిర్యాదు చేశారు పవన్‌ కళ్యాణ్‌. అయితే.. దీనిపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పందించారు. పవన్ కళ్యాణ్ ప్రధానికి గృహ నిర్మాణల భూ సేకరణలో అవినీతి జరిగినట్లు లేఖ రాశాడని…సీబీఐ, ఈడీ విచారణ కోరారని తెలిపారు.

jogi ramesh

30 లక్షల మహిళలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి ‌…ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నాయి…పవన్ కళ్యాణ్ లేవనెత్తిన 13 అంశాలకు సమాధానాలను మీడియా ద్వారా అందజేస్తున్నామని వివరించారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డోర్ నెంబర్ ఉందా?? కనీసం ఏపీలో ఓటు ఉందా?? ఆధార్ కార్డ్ ఉందా?? అని ఫైర్‌ అయ్యారు.

చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసం ఏ గడ్డి అయినా తినడానికి సిద్ధంగా ఉంటాడన్నారు. మేం కూడా లెటర్ రాయబోతున్నామని…చంద్రబాబు కొట్టేసిన స్కిల్ స్కాంలో పవన్ కళ్యాణ్ కు ఎంత ముట్టిందో విచారణ చేయమని లేఖ రాస్తాని స్పష్టం చేశారు. మనీ లాండరింగ్ ఎలా జరిగిందో విచారణ జరిపించాలని కోరతామన్నారు. ఆ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామి అని ఆరోపణలు చేశారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.

Read more RELATED
Recommended to you

Latest news