MLA Rajasingh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కీలక పదవి !

-

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కీలక పదవి దక్కనుంది. బీజేఎల్పీ నేతగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు ఈసారి ఛాన్స్ వస్తుందని సమాచారం.

Key post for MLA Rajasingh of Goshamahal

ఏలేటి మహేశ్వర్ రెడ్డిని BJLP ఉపనేతగా నియమిస్తారని టాక్. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుంచి 8 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వారిలో ఆరు మంది కొత్తవారు. వీరిద్దరే సీనియర్లు కావడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది.. బీజేపీ ప్రభుత్వం వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని ఫైర్‌ అయ్యారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తా అన్న కేసీఆర్ నే తెలంగాణ ప్రజలు మార్చేశారని మండిపడ్డారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందని…తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version