అలాంటి పాత్రలు చేయని ఏకైక స్టార్ హీరో, హీరోయిన్ వీళ్లే..!

-

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ముఖ్యంగా హీరోలు అన్ని పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించగలిగే సత్తా ఉండాలి. అప్పుడే వారు ఆ హీరోలకు అభిమానులుగా మారిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలామంది హీరోలు రకరకాల పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించిన వారు కూడా చాలామంది ఉన్నారని చెప్పాలి. అయితే ఒక హీరో హీరోయిన్ మాత్రం తమకు నచ్చక తమను ఆ పాత్రలో ప్రేక్షకులు స్వీకరిస్తారో లేదో అన్న భయంతో ఏకంగా ఆ పాత్రకే దూరం అయ్యారు. ఇక వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఆయన ఎవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పునాదిగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొన్ని పదుల సంఖ్యలో సినిమాలను తెరకెక్కించి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా చాలామంది హీరోలు ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు.. మరి కొంతమంది అలాంటి ప్రయోగాలు చేయడానికి వెనుకడుగు వేస్తారు ఎందుకంటే అలా ప్రయోగం చేసినప్పుడు ప్రేక్షకులు స్వీకరించకపోతే కెరియర్ నాశనం అవుతుంది అన్న భయంతో చాలామంది ముందడుగు వేయడానికి భయపడతారు.

ఇక అక్కినేని నాగేశ్వరరావు కూడా నెగిటివ్ రోల్స్ చేయడానికి భయపడ్డారట. ఇక అలాంటి పాత్రలు చేస్తే ప్రేక్షకులు స్వీకరిస్తారో లేదో అన్న భయం ఒకవైపు.. మరొకవైపు నెగిటివ్ షేడ్స్ అంటేనే భయపడే ఆయన ఇలా సినిమాలలో కూడా ఆ పాత్రలు చేయడానికి సముఖం చూపించలేదని సమాచారం. ఇక ఆయనే కాదు దివంగత నటీమణి మహానటి సావిత్రి కూడా నెగిటివ్ రోల్స్ చేయలేదని సమాచారం. ఇలా వీరంతా కూడా నెగిటివ్ రోల్స్ చేయకుండా ప్రేక్షకులను మెప్పించి వారి గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news