ఖైరతాబాద్ మహా గణపతికి తొలిపూజ.. హాజరైన మంత్రి తలసాని

-

హైదరాబాద్​లో వినాయక చవితి సందడి మొదలైంది. వాడవాడలా గణపయ్యలు కొలువుదీరారు. లంబోదరుడి నామస్మరణతో వీధులన్నీ మార్మోగుతున్నాయి. మరోవైపు ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 63 అడుగుల మహా గణపతిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు తరలివస్తున్నారు. తాజాగా ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజ జరిగింది.

ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు ఈసారి ‘శ్రీ దశమహా విద్యా గణపతి’గా భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామి వారికి కుడివైపున లక్ష్మీనరసింహస్వామి, ఎడమ వైపు వీరభద్రస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. మహా గణపతికి ఉదయం 11 గంటలకు తొలిపూజ జరిగింది. ఈ పూజలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు. బడా గణేశుడిని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి ప్రత్యేకతలు ఏంటో తెలుసా.. 

  • మట్టితో చేసిన ఈ మహా గణపతి విగ్రహం ఎత్తు 63 అడుగులు.. వెడల్పు 28 అడుగులుగా
  • ప్రధాన మండపం కుడివైపు శ్రీ పంచముఖ లక్ష్మీ నారసింహస్వామి, ఎడమవైపు శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలు 15 అడుగుల ఎత్తున రూపుదిద్దుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version