తెలంగాణలో సినీ ఫక్కీ తరహా అమ్మాయి కిడ్నాప్.?

-

తెలంగాణలోని కురవి పోలీస్ స్టేషన్ లో సినీ ఫక్కీ తరహా అమ్మాయి కిడ్నాప్ జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకొని సహజీవనం గడుపుతున్న అమ్మాయి అబ్బాయి లను విడదీశారు పెద్ద మనుషులు. మేమే అధికారికంగా పెళ్లి చేస్తాం అంటూ అమ్మాయి తరుపున బంధువులు అబ్బాయి కి ఫోన్ చేసి కురవి పోలీస్ స్టేషన్ కు రప్పించారు పెద్ద మనుషులు. అయితే… అబ్బాయి, అమ్మాయిలు కురవి పోలీస్ స్టేషన్ కు రాగానే సినీ ఫక్కీలో అమ్మాయిను పోలీసుల సమక్షంలో నే కిడ్నాప్ చేశారట.

Kidnapping of a girl like a movie girl in Telangana

అటు అమ్మాయి మేము ఇష్టపూరితంగానే పెళ్లి చేసుకున్నాం ఎవరి బలవంతం లేదు అంటూ పోలీసులకు లేఖ రాసిన రక్షణ లేదని యువకుడు ఆందోళన చెందుతున్నాడు. దీనిపై తక్షణమే ఉన్నత పోలీసు అధికారులు స్పందించి ప్రేమ జంటలకు న్యాయం చేయాలని అబ్బాయి బంధువులు వేడుకుంటున్నారు.
కురవి పోలీస్ స్టేషన్ రెండు రోజుల క్రితం మాకు న్యాయం చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు అబ్బాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news