వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం

-

హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతోంది. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో ఆలయ అర్చకులు అలంకరించారు.   స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలిచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయం వద్దకు కుటుంబ సభ్యులతో సహా చేరుకున్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఎల్లమ్మకు మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.

బల్కంపేట ఎల్లమ్మను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారి కల్యాణ ఉత్సవం వైభవంగా సాగుతోందని ఆయన అన్నారు. ఆలయంలో కల్యాణ ఏర్పాట్లు చాలా బాగున్నాయని అధికారులను అభినందించారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్యాలు లేకుండా చూడాలని ఎల్లమ్మ తల్లికి తాను మొక్కుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. పంటలు బాగా పండి ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. మరోవైపు కేంద్రం తరపున ఆలయ అభివృద్ధికి నాలుగున్నర కోట్లు నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. త్వరలో ఆ నిధులకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news