టిఆర్ఎస్ ప్రభుత్వం తీరు ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకి మోత – కిషన్ రెడ్డి

-

టిఆర్ఎస్ ప్రభుత్వం తీరు ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకి మోతలా ఉందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కెసిఆర్ కుటుంబం పదే పదే పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ అంటూ మాట్లాడుతుందని.. కావాలంటే రెండు సంవత్సరాలు వెళ్లి అక్కడ ఉండండి తెలుస్తోంది అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల్లో మోడీ పట్ల అభిమానం పెరుగుతుంటే.. టిఆర్ఎస్ పార్టీ మోడీపై విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ హైదరాబాదులో ఉన్న ప్రతిపక్ష నేతలకు కలవరు.. కానీ పక్క రాష్ట్రాలకు విమానాలు వేసుకుని వెళ్లి అక్కడ నేతలను కలుస్తున్నారని మండిపడ్డారు. మోడీ నీ తప్పు పట్టే విధానాలను పక్కన పెట్టాలని సూచించారు. తెలంగాణలో సర్పంచులు, ఎంపీటీసీ లకు సకాలంలో బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. గ్రామాలలో వీధిలైట్లు, రోడ్లు వేస్తున్నారు అంటే అవి కేంద్ర ప్రభుత్వ నిధులే అన్నారు.

అసైన్డ్ భూములు, శిఖం భూములు, పార్కులు, కేంద్ర ప్రభుత్వ భూములను టిఆర్ఎస్ పార్టీ నేతలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ధరణి పరిస్థితి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గులాబీ దండు గుండాయిజం చేస్తోందని మండిపడ్డారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version