రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ పొడిగిస్తాం: కిషన్‌రెడ్డి

-

హైదరాబాద్‌కు కొత్త రైల్వే టెర్మినల్‌ వస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. జనవరిలో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఎంఎంటీఎస్‌ రెండో ఫేజ్‌లో కొన్ని పనులు పెండింగ్‌ ఉన్నాయని.. ఈ ఫేజ్‌లో కొత్త మార్గాలను వేగంగా పూర్తిచేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ పొడిగిస్తామని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్​లో ఇవాళ నాలుగు రైల్వే సర్వీసులను కిషన్ రెడ్డి ప్రారంభించారు.

నాలుగు రైల్వే సర్వీసులను ప్రారంభించిన అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్‌ రెండో ఫేజ్‌ కోసం రైల్వే బోర్డు నిధులు మంజూరు చేశాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటే త్వరగా పనులు పూర్తిచేస్తాం. రైల్వే మ్యానుఫ్యాక్చర్‌ యూనిట్‌కు భూమిపూజ చేసుకున్నాం. ఆర్‌ఎంయూ నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమవుతాయి అని కిషన్ రెడ్డి తెలిపారు.

దక్షిణ మధ్య రైల్వే రాష్ట్రంలో హడప్సర్- హైదరాబాద్ ఎక్స్‌ ప్రెస్ కాజీపేట వరకు, జైపూర్-కాచిగూడ  ఎక్స్‌ప్రెస్ కర్నూలు సిటీ వరకు, నాందేడ్- తాండూరు ఎక్స్‌ ప్రెస్ రాయచూర్ వరకు, కరీంనగర్ – నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్‌లను బోధన్ వరకు పొడిగించింది. పొడిగించిన అన్ని సర్వీసులకు బుకింగ్‌లు అందుబాటులో ఉంచినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version