CM కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

-

CM కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. స్వమిత్వ పథకం(గ్రామీణ ప్రాంతాలలో ఇళ్లకు సంబంధించిన ఆస్తి ధృవీకరణ పత్రాలను అందించే పథకం) రాష్ట్రంలో అమలు చేయటం గురించి CM కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రామీణ భారతదేశంలోని ప్రజలకు వారి గృహాలకు సంబంధించిన ఆస్తి ధృవీకరణ పత్రాలను అందించి, తద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 24 ఏప్రిల్, 2021 న “సర్వే ఆఫ్ విలేజెస్ ఆబాది & మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ (స్వమిత్వ)” పథకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించటానికి ముందే హర్యానా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో పైలట్ ప్రాజెక్టు క్రింద విజయవంతంగా అమలుచేయటం జరిగిందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ 29 జూలై, 2022 న కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖను వ్రాయడం జరిగిందని వెల్లడించారు. కావున, ఈ విషయంలో మీరు ప్రత్యేకమైన చొరవ చూపించి, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చే గృహాల సర్వేకు సంబంధించిన ఈ స్వమిత్వ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ప్రక్రియను సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోగలరని మనవి చేస్తున్నానన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. …

Read more RELATED
Recommended to you

Exit mobile version