2024లో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ కీలకపాత్ర పోషిస్తుంది : కిషన్‌రెడ్డి

-

భారతదేశానికి 2024 సంవత్సరం అత్యంత కీలకమైన ఏడాది అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా కిషన్ రెడ్డి దర్శనం చేసుకున్నారు.

అనంతరం ఆలయం వెలుపల కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 2024లో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ కీలక పాత్ర పోషించనుందని అన్నారు. ఇజ్రాయెల్‌ – గాజా, రష్యా – ఉక్రెయిన్‌ వంటి ప్రపంచ దేశాల సమస్యలు ఈ ఏడాదిలో పరిష్కారమయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందులో భారత్‌ కీలక పాత్ర షోషించనుందని తెలిపారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఈ ఏడాదిలోనే జరగనుందని చెప్పారు.

కిషన్ రెడ్డితో పాటు నూతన సంవత్సర వేళ పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై , ఉపముఖ్యమంత్రి భట్టి, సినీనటుడు సుమన్‌ తిరుమలలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ఘన స్వాగతం పలికారు. అలాగే  రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ శ్రీవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news