Kodada: కోర్టు నుండి పారిపోయిన నిందితుడు

-

నేరం చేసి పోలీసులకు పట్టుబడకుండా పరారీలో ఉండే వాళ్ళు కొందరు అయితే.. చేసిన నేరాన్ని ఒప్పుకుని కోర్టులో లొంగిపోయేవారు మరికొందరు. ఇక నేరం చేసి పోలీసులకు పట్టుబడి ఏ చిన్న అవకాశం దొరుకుతుందా..? ఎలా తప్పించుకు పారిపోవాలి అని చూసేవారు మరికొందరు. నేరం చేసి.. చేసిన నేరానికి శిక్ష అనుభవించకుండా తప్పించుకోవడం కోసం కొందరు ఖైదీలు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.

ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలా చూశాం. ఇలాంటి ఘటనే తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోదాడ పట్టణంలో ఓ దొంగతనం కేసు విచారణలో భాగంగా నిందితుడిని పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. ఆ నిందితుడిని ఖమ్మం జిల్లా జైలు నుంచి కోదాడ కోర్టులో హాజరుపరచడానికి తీసుకువచ్చారు సూర్యాపేట జిల్లా ఏఆర్ పోలీసులు.

ఇదే అదునుగా భావించిన నిందితుడు మామిడి గోపి పోలీసులను ఏమార్చి బేడీలు తీసుకొని చాకచక్యంగా పరారయ్యాడు. ఈ ఘటనతో పోలీసులు అవ్వక్కయ్యారు. నిందితుడు మామిడి గోపి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news