టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, అమీర్ అలీఖాన్ లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇవాళ ఉదయం ప్రమాణం చేయించారు. అనంతరం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్సీలుగా నియామకమైన ఈ ఇద్దరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ గత బీఆర్ఎస్ సర్కార్ 2023 జులైలో చేసిన సిఫార్సులను అప్పటి గవర్నర్ రద్దు చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాది జనవరిలో ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ లను ఎమ్మెల్సీ స్థానాల్లో నియమించడాన్ని హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది మార్చి 7వ తేదీన ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం రోజు స్టే విధించింది. దీనిపై సుప్రీం కోర్టు తాజాగా స్టే విధిస్తూ.. ఆ స్థానాల్లో కొతవారి నియామకాలను ఆపలేమని పేర్కొంది.