సంక్రాంతి సందడి .. అప్పుడే కోడి పందేలు షురూ అయ్యాయిగా

-

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి షురూ అయింది. పండుగకు మరో వారం రోజులు ఉన్నా అప్పుడే కోలాహలం మొదలైంది. ఇప్పటికే భాగ్యనగర వాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. మరో రెండు మూడ్రోజుల్లో సంక్రాంతి సెలవులు కూడా షురూ అవుతాయి. ఈ నేపథ్యంలో అప్పుడే పలు చోట్ల కోడి పందేలు మొదలయ్యాయి. అయితే ఇది ఏపీలో కాదండోయ్. తెలంగాణలో ఈ కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి.
సంక్రాంతి పండుగను కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా వాంకిడి మండలం ఏజెన్సీ ప్రాంతాల్లో పందేలు జోరుగా సాగుతున్నాయి. పోలీసు అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఈ పందేలు జరుపుతున్నారు. వెల్గి గ్రామ పంచాయతీ శివారులోని ఖాళీ స్థలాల్లో పందేలు ఏర్పాటు చేయగా.. కోళ్ల యజమానులతో పాటు పలు గ్రామాలకు చెందిన వ్యక్తులు కూడా పందేలు కాస్తున్నారు.
ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతున్నట్లు సమాచారం. అయితే కోడి పందేలు ఒకేచోట కాకుండా పలుచోట్ల కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పొలాలను అడ్డుగా చేసుకుని నిర్వాహకులు కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news