తెలుగు రానందుకు చాలా బాధ పడుతున్న : కపిల్ దేవ్

-

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన జూపల్లి బాలమ్మ మెమోరియల్ మండల్ పరిషత్ పాఠశాల స్కూల్ భవనం ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవంలో  మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, మైహోం సంస్థ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు, ఖుషి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ మాట్లాడారు.

నాకు తెలుగు రానందుకు చాలా బాదపడుతున్నాను. నన్ను ఖుషి ఫౌండేషన్ వారు శంషాబాద్ ముచ్చింతల్ కు అహూవానించడం సంతోషం ఉందని తెలిపారు. పేద విద్యార్దులకు అండగా ఉండడం మైహోం సంస్థ తోపాటు ఖుషి ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. చిన్నారుల ప్రదర్శన చూసి నాకు సంతోషం కలిగింది. ముచ్చింతల్ లో పేద విద్యార్థులకు నూతన స్కూల్ భవనం కట్టించడం సంతోషమన్నారు. ఈ పాఠశాలలో చదివే విద్యార్దులు మంచి స్థాయికి వెల్లాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఇదే  పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రధాని కూడా కావచ్చు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news