రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ క్రమంలో సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఇన్ చార్జీ కే.మహేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. కే.కే.మహేందర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టింది అబద్దపు ప్రచారాలతో అని ఆయన విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ నిరహార దీక్ష చేస్తానని చెప్పి.. జ్యూస్ తాగిన వ్యవహారాన్ని ప్రజలు మరిచిపోలేరని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సోనియాగాంధీ తీర్మాణంతోనే అని గుర్తు చేశారు.
ఆమె మాటకు నిలబడిన గొప్పతనం గుర్తు చేస్తూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పని చేస్తుందన్నారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా సోనియాగాంధీ ఆదేశఆలతో రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో ప్రతీ ఒక్క హామీని అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చారని చెప్పారు.