బీఆర్ఎస్ లూట్, సూట్ సర్కార్ : ఎంపీ కోమటి రెడ్డి

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నాయకులపై విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  మంత్రి కేటీఆర్‌కు  భువనగిరి  ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి  కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్‌ను లూట్, సూట్ సర్కార్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ‘కే’ టాక్స్ వసూలు చేయడానికి అలవాటు పడిందన్నారు. కే టాక్స్ రూపంలో రూ.1000 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. కేటీఆర్ ఎజెండా ఫ్యామిలీ ఫస్ట్, ప్రజలు లాస్ట్ అన్నారు. ఇదే 9 ఏళ్ళుగా బీఆర్ఎస్ చేస్తోందన్నారు. ఫేక్ యువరాజు కేటీఆర్ కార్పోరేట్‌లను దోచుకుంటున్నారని మండిపడ్డారు.

 

మోసగాడు అయిన కేసీఆర్ ప్రజలు వంచనకు గురిచేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్‌లో రూ.900 కోట్లు, వారి బినామీల అకౌంట్‌లో రూ.90 వేల కోట్లు జమ చేసుకున్నారని అన్నారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పరులను జైలుకు పంపడం ఖాయమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనలోనే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version