తెలంగాణాలో ధనికమైన ఎమ్యెల్యే అభ్యర్థిగా కోమటిరెడ్డి!

-

తెలంగాణాలో ధనికమైన ఎమ్యెల్యే అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలిచాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల నామినేషన్ల సమయంలో సమర్పించే అఫీడవిట్లలో అభ్యర్థుల ఆస్తుల వివరాలు చూసి ఆశ్చర్య పోవడం ప్రజల వంతువుతోంది. ఈ సమయంలోనే తెలంగాణలో అత్యంత ధనిక ఎమ్మెల్యే అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రికార్డు సృష్టించారు.

komatireddy-rajgopal-reddyvjpg

నవంబర్ 9వ తేదీన చివరి నిమిషంలో పరిగెత్తుకుంటూ నామినేషన్ దాఖలు చేయగా…. ఆ అఫీడవిట్ ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తుల విలువ రూ. 458 కోట్లుగా తేలింది. అందులో రూ.297.36 కోట్ల చరాస్తులు ఉండగా…. నగదు, బ్యాంకు డిపాజిట్లు, సుషీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ లో రూ. 239.31 కోట్ల విలువ కలిగిన షేర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. కరీంనగర్ బిఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అఫీడవిట్ లో తన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించారు. ఆయనకు రూ. 2 కోట్ల విలువైన 436 తులాల బంగారం, రూ. 80 వేల విలువైన కేజీ వెండి ఉన్నాయని పేర్కొన్నారు. తన భార్యకు రూ. 4.50 కోట్ల విలువైన 800 తులాల బంగారం, కేజీ వెండి ఉన్నట్లు, కుమార్తెకు రూ. 14 లక్షల విలువైన 25 తులాల బంగారం ఉందని చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో గోల్డ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ గంగుల అని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news