ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి….విజయవాడ -హైద్రారాబాద్ జాతీయ రహదారిని 6 లైన్ నిర్మణం పై చర్చించారు. ఒప్పందం ప్రకారం హైదరాబాద్-విజయవాడ ఆరు వరుసల రహదారి పనులు జీఎంఆర్ సంస్థ 2022, ఏప్రిల్‌లో ప్రారంభించాలి… రాష్ట్ర విభజన నేపథ్యంలో పనులు చేపట్టలేమంటూ జీఎంఆర్ సంస్థ ఆర్బిట్రేషన్‌కు వెళ్లిందన్నారు. ఎన్‌హెచ్ఏఐ కట్టిన రూ.950 కోట్లను జీఎంఆర్ సంస్థ బ్యాంకులో వేసుకుంది..దేశంలో ఎక్కువ రద్దీ ఉన్న రహదారి హైదరాబాద్-విజయవాడ రహదారి.. డిజైన్ తప్పుగానే చేశారు.
విశాఖ నుంచి విజయవాడ రహదారి మంచిగా డిజైన్ చేసి పనులు పూర్తి చేశారు..ఈ సమస్యపై పార్లమెంట్ లో నేను ప్రశ్నించా.. గతంలో రివ్యూ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. ఈ రోజు మరో సారి రివ్యూ చేశారని కేంద్ర మంత్రితో చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సమస్యలు పరిష్కరించి త్వరలోనే నెలలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద రెండేళ్లలోనే వంద మంది చనిపోయారని కేంద్ర మంత్రి గడ్కరీకి తెలిపాను.
ఈ మార్గంలో ఎక్కడెక్కడ వంతెనలు, అండర్ పాస్‌లు కావాలో ప్రజలను అడిగి చేస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.చౌటుప్పల్, చిట్యాల, టేకుమట్ల, సూర్యాపేట ఈనాడు కార్యాలయం వద్ద ఫ్లైఓవర్లు కట్టాలని కోరాం…ఆ రహదారిపై మా ప్రాణాలకు గ్యారంటీ లేదు.. యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్‌లను గుర్తించాలని చెప్పడం జరిగిందని వెల్లడించారు. యాక్సిడెంట్ స్పాట్‌లు ఉన్నందున డిజైన్ మార్చాలని కోరాం.రాష్ట్ర విభజన చట్టంలో రోడ్ రైలు అనుసంధానంతో పాటు బుల్లెట్ ట్రైన్ చేపడతాం అన్నారు. మేం వాటి గురించి మాట్టాడడం లేదని. తొలుత రహదారిని విస్తరించాలని కోరామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.