కొడుకు, బిడ్డ, అల్లుడు రాజ్యం పోయి… ప్రజా రాజ్యం వచ్చింది – కోమటిరెడ్డి

-

కొడుకు, బిడ్డ, అల్లుడు రాజ్యం పోయి… ప్రజా రాజ్యం వచ్చిందంటూ తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. SLBC ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందించడమే నా లక్ష్యం అని వివరించారు తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి.

2014లో అధికారంలోకి వచ్చిన BRS 10 ఏళ్లు అన్ని హామీలను గాలికి వదిలేసిందని ఆగ్రహించారు. అసలాయిన ఫామ్ హౌస్ లో పడుకుంటే.. హరీష్ రావు, కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి. కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తే… అధికారం కోల్పోయి.. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ లు కోల్పోయిందని తెలిపారు. 7 లక్షల కోట్లు తిన్న ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి. కొడుకు, బిడ్డ, అల్లుడు రాజ్యం పోయి. ప్రజా రాజ్యం వచ్చిందని సెటైర్లు పేల్చారు తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version