దిండు కవర్లను ఎన్ని రోజులకు ఉతకాలి..? ఈ పొరపాటు మాత్రం చెయ్యొద్దు..!

-

రోజంతా అలసిపోతూ ఉంటాం. రాత్రి నిద్రపోతాం. అయితే రాత్రి నిద్ర పోయేటప్పుడు మనం దిండు ని ఉపయోగిస్తాం. చెమట, డైట్ స్కిన్ సెల్స్ తో పరుపులు, దుప్పట్లు, దిండ్లు, సూక్ష్మ క్రిములు అభివృద్ధి చెందడానికి చాలా అనువైన ప్రదేశాలు. రోజూ 50 కోట్ల చర్మ కణాలు శరీరం నుంచి ఊడిపోతాయి. డస్ట్ మైట్లకు ఇది విందు భోజనం వంటిది. పురుగుల కారణంగా వాటి విసర్జితాల కారణంగా అలర్జీ, ఉబ్బసం వంటి సమస్యలు వస్తాయి. అందుకని ఎప్పుడూ కూడా దుప్పట్లు, పిల్లో కవర్స్ వంటివి క్లీన్ గా ఉండాలి. బ్యాక్టీరియా అనేది ప్రజల స్కిన్ మైక్రో బయోమలో భాగంగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో చర్మం నుంచి పడిపోతుంది ఇది ప్రమాదకరం కానప్పటికీ బయట గాయాలు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే తీవ్రమైన అనారోగ్యానికి కారణం అవుతాయి.

ఎప్పటికప్పుడు దిండు కవర్లని మార్చుకోవడం చాలా ముఖ్యం. 2022లో మంకీ పాక్స్ తో ఆసుపత్రిలో చేరిన రోగుల గదుల నుంచి నమూనాలని పరిశీలించారు. బెడ్ షీట్లను మార్చే క్రమంలో గాలిలోకి విడుదల అవుతున్నట్లు గుర్తించారు. ఆరోగ్యవంతులు బెడ్ షీట్లు కంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ బెడ్ షీట్ లలో వ్యాధికారిక బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందట. టాయిలెట్ సీట్ పై ఉండే దానికంటే 17 వేల రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా దిండు కవర్ల పై ఉంటుందని తెలుస్తోంది. రాత్రిపూట తలలోంచి చెమట కారడం వలన ఫంగస్ దిండ్లో చేరుతుందిట.

కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని మార్చుకోవడం మంచిదట. మనుషులను నిద్రపోయే టైంలో నోటికి దీనికి మధ్య ఉన్న సామీప్యత కారణంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడే వాళ్ళకి ముఖ్యంగా ఆస్తమా సైనసైటిస్ ఉన్న వాళ్ళకి సమస్యలు వస్తాయట. ఈ ఫంగస్ కారణంగా టీబీ లేదా ధూమపాన సంబంధిత ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుందట. వారానికి ఒకసారి బెడ్ షీట్లను ఉతకడం మంచిది అలాగే దిండు కవర్లను కూడా వారానికి ఒకసారి మార్చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version