రేవంత్ రెడ్డి సీఎం పదవిపై మరోసారి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి బాంబు పేల్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు అందరికి రాలేదు, కొందరికే వచ్చింది నేను ఒప్పుకుంటానన్నారు. సీఎం తప్పు మాట్లాడినా నిర్మొహమాటంగా చెప్పేస్తా అని వెల్లడించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Komati reddy rajgopal reddy
Komatireddy Rajagopal Reddy’s hot comments once again on Revanth Reddy’s CM post

మొన్న రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటానని అంటే తప్పని ట్వీట్ చేశానన్నారు. మనకి మంచి రోజులు రాబోతున్నాయి అని పేర్కొన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాగా 10 ఏళ్ళు నేనే సీఎం అంటూ… రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి షాకింగ్ ట్వీట్ చేశారు. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని ఫైర్ అయ్యారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని చురకలు అంటించారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news