తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయానికి పైనే పడుతుందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న 68,838 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా… 22,212 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.49 కోట్లు వచ్చినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.

వర్షాకాలం అయినప్పటికీ తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. కాగా మరో మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాలలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు వెళ్లాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనేక రకాల చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.