భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచనలు చేశారు. రాష్ట్ర ఆర్&బీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి… ఈ రోజు రాష్ట్రంలో రెడ్ అలెర్ట్ జారీ చేసిన 11 జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెగిపోయేందుకు అవకాశం ఉన్న చెరువులు, కుంటలకు తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నిరంతరం అధికారులతో టెలిఫోన్ లో మాట్లాడుతూ చేపట్టాల్సిన సహయకచర్యలపై సూచనలు చేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి… ఎక్కడా ఏ చిన్న ఇబ్బంది జరగకుండా పకడ్బందీగా చర్యలకు ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో జిల్లాల వారీగా టోల్ ఫ్రీ నెంబర్లు విడుదల చేశారు. ప్రజలు ఏ అవసరం ఉన్నా కాల్ చేయాలని సూచనలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ప్రభుత్వ కంట్రోల్ రూం ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలని ఆయన కోరారు. నల్గొండ ప్రజలకు ఏదైన తక్షణ సహాయం అవసరంఉంటే.. 1800 4251 442 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలకు సూచించారు.
- భారీ వర్షాల నేపథ్యంలో వర్షాలు, వరదల మానిటరింగ్‌పై తెలంగాణ సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- కంట్రోల్ రూమ్ నెంబర్ 040 – 2345 4088