జగదీశ్ రెడ్డి, ప్రభాకర్ రావు జైలుకు పోవడం ఖాయం హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నాడు పవర్ లేని పవర్ మినిస్టర్ జగదీశ్ రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ అసెంబ్లీ సమావేశం ప్రారంభం అయినప్పటి నుంచి.. కోమటిరెడ్డి బ్రదర్స్.. జగదీశ్ రెడ్డి పై రెచ్చిపోయారు.

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కోమటిరెడ్డి … 10వేల కోట్లు దోపిడీ చేశారని ఆరోపణలు చేశారు. అటు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ…మీరు చేయాల్సిన పని మీరు చేశారు…మేము చేయాల్సింది మేము చేస్తామన్నారు. సీఎం విచారణ చేస్తాం అన్నారని.. Brs వాళ్ళను చూస్తే బాధ అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. Brs రాబోయే రోజుల్లో కనుమరుగు అవ్వడం ఖాయమని… వాళ్ళను చూస్తే జాలి వేస్తుందని ఎద్దేవా చేశారు రాజగోపాల్ రెడ్డి.