కాంగ్రెస్​లో చేరిక గురించి నా సోదరుడు నాతో మాట్లాడలేదు : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

-

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన త్వరలోనే తిరిగి తన సొంత గూడైన కాంగ్రెస్​లోకి చేరనున్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించే సత్తా ప్రస్తుతం బీజేపీ కంటే కాంగ్రెస్​కే ఎక్కువగా ఉన్నందున ఆయన తిరిగి కాంగ్రెస్​లో చేరుతున్నట్లు తాను విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్​లో చేరడంపై ఆయన సోదరుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అందుకే కాంగ్రెస్​లో చాలా మంది నేతలు చేరుతున్నారని అన్నారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరడం గురించి తనతో మాట్లాడలేదని చెప్పారు. డైరెక్టుగా ఆ విషయం అధిష్ఠానంతో మాట్లాడాడని వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాకుండా చాలా మంది కీలక నేతలు హస్తం గూటికి వస్తున్నారని వెంకట్​ రెడ్డి పేర్కొన్నారు.

“కర్ణాటకలో హామీ ఇచ్చిన స్కీమ్స్ అమలు అవుతున్నాయి. ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది. సెకండ్ లిస్ట్ ఈరోజు పూర్తవుతుంది..రేపు విడుదల అవుతుంది. 6 స్థానాల్లో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి. ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. సీఈసీ వద్ద ఫైనల్ అయ్యేవరకు బయట మాట్లాడకూడదు. వామపక్షాలకు నాలుగు సీట్లు అంటే తక్కువ కాదు. మిర్యాలగూడలో కూడా అడిగారు.. అక్కడ ఓటు ఎంత వరకు ట్రాన్సఫర్ అవుతుందనేది చూడాలి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి 70 – 80 సీట్లు వస్తాయి. పొత్తుల పై సాయంత్రం క్లారిటీ వస్తుంది.” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news