వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎన్నికలకు నెల ముందు వరకు రాజకీయాలు మాట్లాడబోనని మరోసారి స్పష్టం చేశారు. భువనగిరి ప్రజలు ఎంపీగా ఎన్నుకోవడంతో ఆ నియోజకవర్గాల ప్రజలకు పూర్తిస్థాయిలో అండగా నిలుస్తారని స్పష్టం చేశారు. ఢిల్లీలో చాలా హైపర్ కమిటీలు కాంగ్రెస్ లో ఉన్నాయని వ్యాఖ్యానించారు.
తనకి పదవులు ముఖ్యం కాదని.. కార్యకర్తలు ముఖ్యమని అన్నారు కోమటిరెడ్డి. మంత్రి పదవిని వదిలేసా.. పార్టీ పదవులు ఎంత? అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తాజాగా టీపీసీసీకి జంబో కమిటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై స్పందించిన కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.