ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీకి త్యాగాలకు మారు పేరైన స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ముఖ్యంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీని ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఇనిస్టిట్యూట్ కు త్యాగాలకు మారుపేరైన స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని నిర్ణయించాం.
వచ్చే ఏడాది నుండి స్కిల్ యూనివర్సిటీలోనే ఈ ఇనిస్టిట్యూట్ కు భవనం కేటాయిస్తాం. నాకు రైతన్నలు, నేతన్నలు రెండు కళ్లు. నేతన్నల రుణాలు రూ.30 కోట్లు మాఫీ చేసి వారిని రుణ విముక్తి చేస్తామని ట్వీట్ లో వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ చేసిన వారిది త్యాగం కాదని.. తెలంగాణ కోసం పదవీని తృణపాయంగా వదిలేసిన కొండా లక్ష్మణ్ బాపూజీది అసలు సిసలైన త్యాగం అన్నారు. త్యాగానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.