ఫోన్ ట్యాపింగ్‌కు హరీశ్‌ రావుకు ఎలాంటి సంబంధం లేదు : వివేకానంద్

-

మాజీ మంత్రి హరీశ్‌రావుపై తప్పుడు కేసు నమోదు చేయడంపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలను మోసం చేశారు. ఎన్నికల సమయంలో ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఏడాది పూర్తయ్యినా ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే.. రేవంత్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాజీ మంత్రి హరీశ్‌రావు కేసులు నమోదు చేయడం సరికాదు.

ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు ఎవతలి వ్యక్తి ఎవరూ? వారి చరిత్ర ఏంటి, విశ్వసనీయత ఏంటీ అని పోలీసులు ఆలోచించాలి. చక్రదర్‌గౌడ్ అనే చీటర్ వెళ్లి కేసు పెడితే.. ఎలాంటి ఆధారాలు లేకున్నా హరీశ్‌రావు లాంటి వ్యక్తిపై కేసు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు పెట్టడం హాస్యస్పదం. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే మాజీ మంత్రి హరీశ్‌రావుపై కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఫోన్ ట్యాపింగ్‌కు హరీశ్‌రావుకు ఎలాంటి సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పలేకనే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తక్షణమే మాజీ మంత్రి హరీశ్ రావుపై పెట్టిన బూటకపు కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని వివేకానంద్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version