రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, పేదలకు భవిష్యత్తు ఇవ్వాలని సీఎం పని చేస్తున్నారు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అయితే గత ప్రభుత్వంలో క్షేత్రస్ధాయిలో భూ సమస్యలు సృష్టించారు. ఆర్ధికంగా దోచుకునే పథకాలే తప్ప పేదవాడికి ఉపయోగపడే పనులు చేయలేదు. 67 వేల గ్రీవెన్సులు రెవెన్యూ లోనే వచ్చాయి. గ్రీవెన్సులు అన్నీ అక్కడి సమస్యలు అక్కడికక్కేడే పరిష్కరించేలా రెవెన్యూ సదస్సు ఉంది.
కానీ 2018 తరువాత మరల రెవెన్యూ సదస్సులు పెట్టలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ చేసాక ఇప్పుడు రెవెన్యూ సదస్సులు వస్తున్నాయి. ఈనెల 6 నుంచీ వచ్చేనెల 8 వరకూ 17500 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. 22a కింద పెట్టిన వాటికి కూడా న్యాయం చేసేలా ఈ సదస్సుల్లో పరిష్కరిస్తాం. అన్యాక్రాంతం అయిన వాటిని కూడా అసలు యజమానిని డిస్ప్లే చేసి రెవెన్యూ సదస్సులో పరిష్కరిస్తాం. రెవెన్యూ నే కాకుండా హౌసింగ్ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. గత ప్రభుత్వం వారి కార్యకర్తలకే భూములిచ్చింది. అర్హులై స్ధలాలు లేని వారికి భూములు, నూతన రేషన్ కార్డులు ఇచ్చేలా ఒకేదగ్గర పరిష్కరిస్తాం. లీజుకు తీసుకున్న వాటి వినియోగం పై ఒక నిర్ణయం రెవెన్యూ సదస్సులలో తీసుకుంటాం అని మంత్రి అనగాని పేర్కొన్నారు.