BRS అంటే భారత ” రైతు ” సమితి – KTR

-

BRS అంటే భారత ” రైతు ” సమితి అని తెలిపారు మంత్రి కేటీఆర్‌ KTR. ఈ మేరకు రైతుతో ఉన్న సీఎం కేసీఆర్‌ ఫోటోను షేర్‌ చేశారు మంత్రి కేటీఆర్‌. BRS అంటేనే.. భారత ” రైతు ” సమితి అని.. ఒక్క తెలంగాణలోనే మన అన్నదాతకు… పెట్టుబడికి రూ. పది వేలు పంట నష్టపోతే రూ. పది వేలు ఇస్తున్నట్లు వెల్లడించారు మంత్రి కేటీఆర్‌.

అందుకే మన రైతన్న మనోగతం ” ఒక్క కేసీఅర్ సారు ఉంటే చాలు… మాకు అదే పదివేలు… ” వేరేటోళ్ళను పొరపాటున నమ్మినా…తెలంగాణ మళ్ళీ వెనక్కి.. వందేళ్లు అంటూ ట్వీట్‌ చేశారు కేటీఆర్‌. కాగా.. తొలిసారి కౌలు రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకుని కేసీఆర్‌ ప్రభుత్వం. ఆకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.10వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో వారిలో హర్షం వ్యక్తం అవుతోంది. ఇప్పటివరకు రైతుబంధు, బీమా వంటి ఏ పథకాలు వీరికి అందడం లేదు. వాస్తవానికి రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులు ఉండగా వ్యవసాయ భూమిలో 30% వారే సాగు చేస్తున్నారు. మామిడి తోటల రైతుల్లో 80% మంది కౌలుదారులే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version