‘సీఎం కేసీఆర్ ఏనాడైనా ప్రజలను కలిశారా’.. విపక్షాల విమర్శలపై కేటీఆర్ క్లారిటీ

-

“సీఎం కేసీఆర్ ఎప్పుడు ఫామ్ హౌజ్​కే పరిమితం.. ఫామ్ హౌజ్ సీఎం.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏనాడైనా ప్రజలను కలిశారా.. ఫిర్యాదులు స్వీకరించారా” అంటూ ప్రతిపక్షాలు నోరునెత్తి మొత్తుకుంటూ తరచూ విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం. అయినా ఏనాడూ ఈ విమర్శలపై కేసీఆర్ స్పందించలేదు. అయితే ఈ విషయాలను రాష్ట్ర మంత్రి కేటీఆర్ రెండు, మూడుసార్లు కేసీఆర్‌ వద్ద ప్రస్తావించారట. అయితే దానికి కేసీఆర్ సమాధానం ఏమిచ్చారో మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సుపరిపాలన దినోత్సవం సందర్భంగా మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నూతన వార్డు కార్యాలయాల వ్యవస్థ సన్నాహక సమావేశంలో మంత్రి సుదీర్ఘంగా ప్రసంగించారు.

‘రాష్ట్రంలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, కౌన్సిలర్ల వంటి ప్రజాప్రతినిధులున్నారు. ఇంతమంది ఉండగా.. పింఛను, రేషన్‌కార్డు, మోరీ, నల్లా, పాస్‌బుక్‌.. ఇలా అనేక సమస్యలపై సీఎంకు ఫిర్యాదు ఇవ్వడమంటే.. ప్రభుత్వ వ్యవస్థల పనితీరు సరిగా లేనట్లే. ఆయా సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమవ్వాలి. అంతేగానీ.. దర్బార్‌ పేరిట జనాన్ని రప్పిస్తూ.. వారిచ్చే ఫిర్యాదులు తీసుకుని.. ఏదో చేసేస్తున్నట్లు దర్పం ప్రదర్శించడం గొప్ప విషయం కాదు. సమస్యలను పరిష్కరించే వ్యవస్థను పటిష్ఠం చేయడం ప్రధానం’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు కేటీఆర్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news