సీఎం జగన్‌కు చంద్రబాబు నాయుడు లేఖ

-

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టాలని కోరుతూ సీఎం జగన్ కు టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పశ్చిమగోదావరి జిల్లా చించినాడ గ్రామంలోని దళితుల భూముల్లో వైసిపి నేతలు దౌర్జన్యంగా అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతున్నారని పేర్కొన్నారు.

అడ్డుపడితే వారిపై దాడులు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తవ్వకాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా,  కేంద్రమంత్రి అమిత్ షా ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా విశాఖలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. చెన్నై నుంచి సాయంత్రం 5:50 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. తిరిగి రాత్రి 9:30 గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.

Read more RELATED
Recommended to you

Latest news