తెలంగాణలో సంవత్సరం కాలంగా కౌరవ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రైతు నిరసన దీక్ష సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు కొడంగల్ లో కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తోందని తెలిపారు. కులగణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉన్నారు.. రైతు రుణమాఫీ చేసిన రైతులందరూ సంతోషంగా ఉన్నారు.. రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్లు సంతోషంగా ఉన్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు అని అంటున్నావు కదా రేవంత్ రెడ్డి.
దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి మళ్లీ ఇక్కడికి రా.. ఎవరు గెలుస్తారో చూద్దాం. మీకు మాట ఇస్తున్నాం.. ప్రచారానికి రాం. పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు. మేము జిల్లాలో కొంత మందిమి తిరుగుతాం. గెలుచుడు కాదు.. 50వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్లా రాజకీయంలో కూడా ఉండను అని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు.