బీఆర్ఎస్ వైపు స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య చూపు..

-

తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.. సీట్ల కోసం అధికారం కోసం వలస పక్షులు గూడులు మారుస్తున్నారు.. ఉదయం టిఆర్ఎస్ లో ఉండే నేతలు సాయంత్రం కల్లా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.. కాంగ్రెస్లో ప్రాధాన్యత లేదంటూ టిక్కెట్ కోసం బీఆర్ఎస్ లోనూ చేరుతున్నారు.. దీంతో తెలంగాణలో రాజకీయ హడావిడి మొదలైంది.. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అధికార పార్టీలోకి దూకేసే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది..

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంతవరకు.. అధికారం అనుభవించిన నేతలందరూ భవిష్యత్తు కోసం హస్తం గూటికి చేరుతున్నారు.. తాజాగా వరంగల్ కు చెందిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఆయన కూతురు కావ్యకి కాంగ్రెస్ పార్టీ టికెట్ కన్ఫామ్ చేసింది.. దీంతో కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి బిఆర్ఎస్ కి రాజీనామా చేసిన స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య తిరిగి బీఆర్ఎస్ కి వెళ్తారని ప్రచారం జరుగుతుంది.. ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన బి ఆర్ ఎస్ కీలక నేతలు రాజయ్యకు టచ్ లో ఉన్నారట.. రాజీనామా ఉపసంహరించుకుంటే వరంగల్ టికెట్ ఇస్తామని నేతలు ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతుంది.. దీనిపై రాజయ్య కూడా డైలమాల్లో పడినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు..

గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాజయ్య ఎన్నికల అనంతరం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.. కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అందరు భావించినప్పటికీ అటుపక్క నుంచి స్పందన రాకపోవడంతో ఆయన తటస్థంగా ఉన్నారు.. ఈ క్రమంలో కడియం శ్రీహరి తో పాటు, ఆయన కూతురు కావ్య సైతం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. కావ్యాను ఓడించేందుకు దీటైన నేత కోసం బీఆర్ఎస్ అన్వేషిస్తుంది.. ఈ క్రమంలో రాజయ్యను బరిలోకి దింపాలని ఆలోచనలో అధినేత కేసీఆర్ ఉన్నారట.. దీనికి రాజు ఎలా స్పందిస్తారో చూడాలి మరి

Read more RELATED
Recommended to you

Latest news