ఏది కావాలి మనకు.. జర ఆలోచించు రైతన్నా: మంత్రి కేటీఆర్‌

-

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఓవైపు సభలు, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోవైపు సోషల్ మీడియాలోనూ తన జోరు చూపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్​పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాజాగా కేటీఆర్ రైతులను ఉద్దేశిస్తూ మరో ట్వీట్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, కర్ణాటకలో కాంగ్రెస్‌ అమలు చేస్తున్న రైతు సంక్షేమాలను బేరీజు వేస్తూ.. ఏది కావాలో ఎంచుకోవాలని రైతులకు, ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు. కేసీఆర్‌ ఇస్తున్న 24 గంటల విద్యుత్‌ కావాలా? కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇస్తున్న 5 గంటల విద్యుత్‌ కావాలా? లేక తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెప్పిన 3 గంటల విద్యుత్‌ కావాలా? అని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. రైతుబంధు, రైతుబీమా ఇచ్చి ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్‌ కావాలా? ఆరు దశాబ్దాలు ఆగం చేసిన వాళ్లు కావాలా? అని ట్వీట్​లే పేర్కొన్నారు. నెర్రెలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్‌ కావాలా? ఏది కావాలి మనకు? ఆలోచించు రైతన్నా?’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news