నేను రష్మిక అంత ఫేమస్ కాదు.. కానీ : మంత్రి కేటీఆర్

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వాక్పటిమ గురించి అందరికీ తెలిసిందే. ఆయన స్పాంటెనిటీ.. మాటల్లో క్లారిటీకి చాలా మంది ఫిదా అవుతుంటారు. అప్పుడప్పుడు ఆయన చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు తాజాగా ఆయన చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న భయం డీప్ ఫేక్. తాజాగా డీప్ ఫేక్ గురించి ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ ఇది అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకూ ముప్పు కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారికి మరింత హాని చేకూరుస్తుందని అన్నారు. తాను రష్మిక అంత ఫేమస్ కదంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే తనలాంటి రాజకీయ నాయకులకు కూడా డీప్ ఫేక్ వల్ల ముప్పు పొంచి ఉందని తెలిపారు. తాము మాట్లాడే మాటలను వక్రీకరించి.. సోషల్ మీడియాలో వీడియోలను వైరల్ చేస్తూ తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని చెప్పారు. ఇందుకోసం నల్సార్ వర్సిటీతో కలిసి సైబర్ నేరాలపై ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news