తెలంగాణ భవన్‌లో భారీ కేక్ కట్ చేసిన కేటీఆర్

-

KTR: తెలంగాణ భవన్‌ లో కేక్ కట్ చేశారు బీ ఆర్‌ ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేక్ కట్ చేశారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మధుసూధనాచారి, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

KTR cut the cake at Telangana Bhavan on the occasion of KCR’s birthday

ఇది ఇలా ఉండగా… ఆస్ట్రేలియాలో కేసీఆర్‌ కు అరుదైన ఘనత దక్కింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, అడిలైడ్, బ్రిస్బెన్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభ్యులంతా కేసీఆర్ గారి దీర్ఘాయుష్షు కోసం ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వృక్షార్చనతో అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news