ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు నేడు దిల్లీకి కేటీఆర్

-

దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్టయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు మాజీ మంత్రి, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు దిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కవితతో ఆయన మాట్లాడనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో పలుమార్లు కేటీఆర్ తన సోదరిని కలిసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సీబీఐ ఆమెను కస్టడీలోకి తీసుకోవడంతో మరోసారి మీట్ అయ్యేందుకు దిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది.

రెండు రోజులపాటు సీబీఐ కస్టడీలో ఉండనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారం చేసుకుని అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. రౌస్ అవెన్యూ న్యాయస్థానం ఆదేశాలతో శుక్రవారం రోజున ఆమెను సీబీఐ కార్యాలయానికి తరలించారు. కస్టడీలో ఉన్న కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి అధికారులు వైద్య పరీక్షలు చేయించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఆమె న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు కేటీఆర్ కవితను కలవనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news