నేడు బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

-

మూడో సారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ ప్రభుత్వంగా నిలవాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. 300లకు పైగా సీట్లు సాధించాలనే పట్టుదలతో ఎన్నికల ప్రచారం సాగిస్తోంది. ఓవైపు ప్రధాని మోదీ.. మరోవైపు కేంద్ర మంత్రులు, స్టార్ క్యాంపెయినర్లు వరుస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. పదేళ్లలో దేశానికి చేసిన అభివృద్ధి, అంతర్జాతీయంగా భారత్ సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తున్నారు. మరోసారి తమకు అధికారం కట్టబెడితే భారత్ను అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని హామీలు ఇస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన బీజేపీ .. సార్వత్రిక ఎన్నికల కోసం ‘సంకల్ప పత్రం’ పేరుతో ఈరోజు తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ప్రధాని మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించనున్నారు. ‘మోదీ గ్యారంటీ: 2047 నాటికి వికసిత భారత్‌’ అనే ఇతివృత్తంతో.. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా బీజేపీ తమ మేనిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news