ఇది నిజంగా ఎన్నడూ జరగకూడని విషాదం : కేటీఆర్‌

-

ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పలు దేశాల అగ్రనేతలు కూడా స్పందిస్తున్నారు. ఈ ఘటన తమను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీట్లు చేస్తున్నారు. ఈ ఆపద సమయంలో భారత్​కు అండగా నిలుస్తామని భరోసా కల్పిస్తున్నారు.

అయితే ఒడిశా ఘటనపై తాజాగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ దుర్ఘ‌ట‌న‌లో 278 మంది ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోవ‌డం ప‌ట్ల దిగ్భ్రాంతివ్య‌క్తం చేశారు. రైలు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల‌కు ఆయ‌న సంతాపం తెలిపారు. ప్ర‌మాద బాధితులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రైలు ప్ర‌మాదాన్ని నివారించే యాంటీ కొలిజ‌న్ డివైస్‌లు ఏమైన‌ట్లు మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు. ప్ర‌మాద తీవ్ర‌త చాలా ఊహించ‌ని రీతిలో ఉంద‌ని, ఈ విషాదం జ‌ర‌గాల్సింది కాదు అని ఆయ‌న ట్వీట్ చేశారు.

మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version