ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 278 మంది మరణించగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనపై రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. అయితే కేవలం దేశ నాయకులే కాక.. ఈ ఘటనపై విదేశీ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సానుభూతి ప్రకటించారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత పౌరులకు కెనడియన్లు అండగా ఉంటారని పేర్కొన్నారు. అలాగే తైవాన్ ప్రెసిడెంట్ ట్సాయి ఇంగ్ వెన్ కూడా మృతుల కుటుంబాలకు , క్షతగాత్రులకు సంతాపం ప్రకటించారు. ఆస్ట్రేలియా, శ్రీలంక విదేశాంగ మంత్రులు కూడా స్పందించారు. బాధిత కుటుంబాలకు రష్యా అంబాసిడర్ డెనిస్ అలిపొవ్ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
The images and reports of the train crash in Odisha, India break my heart. I’m sending my deepest condolences to those who lost loved ones, and I’m keeping the injured in my thoughts. At this difficult time, Canadians are standing with the people of India.
— Justin Trudeau (@JustinTrudeau) June 3, 2023
Praying for everyone affected by the train accident in India. I extend my heartfelt condolences to the victims and their families, and hope that rescue operations can save all those in need.
— 蔡英文 Tsai Ing-wen (@iingwen) June 3, 2023