ఏపీలో ప‌ర్యటించ‌నున్న అమిత్ షా.. జేపీ న‌డ్డా టార్గెట్ 2024 ఎన్నికలేనా..?

-

బిజెపి అగ్ర‌నేత‌లు ఏపీపై ఫోక‌స్ పెట్టారు.ఈ సారైనా కొన్ని సీట్లు సాధించే లక్ష్యంతో రాష్ట్ర ప‌ర్య‌ట‌ల‌న‌కి శ్రీకారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖకు వస్తున్నారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు.అలాగే ఓ బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు. ఈ మేరకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

మరోవైపు ఈ నెల 10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతికి రానున్నారు. ఇంకోవైపు జనసేనతో పొత్తు కొనసాగుతోందని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జననేన అధినేత పవన్ క‌ల్యాణ్ చెపుతున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే యోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై బీజేపీ నుంచి ఇంత వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

కాగా వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. కానీ అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైనట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. తమ అభ్యర్థుల పేర్లను కూడా పార్టీలు ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాయి. అలాగే పవన్ వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేతలు ఏపీపై ఫోకస్ పెట్టారు. వరుసగా రాష్ట్ర పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version