2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా రాహుల్ గాంధీ | కేటీఆర్

-

అధికారం లోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు నిరుద్యోగుల ఆశలతో చెలగాటం ఆడుతున్నారు అని కేటీఆర్ అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా రాహుల్ గాంధీ. నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు నిజమైతే జాబ్ క్యాలెండర్ లో రెండు ఉద్యోగాలు కూడా పెట్టలేదు. రెండు లక్షల ఉద్యోగాలపై మాట్లాడడానికి రెండు నిమిషాలు టైం అడిగితే ఇవ్వలేదు. ప్రభుత్వం మాట్లాడకుండా పారిపోయింది. జీవో 46 ను సవరిస్తామని, ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మభ్యపెట్టారు.

మా పార్టీలో గెలిచి పార్టీ మారిన ఒక వ్యక్తి మాపై అసభ్యంగా మాట్లాడే విధంగా చేస్తున్నారు. బజారు మాటలు మాపై మాట్లడిపించిన సిఎం కి బుద్ధి ఉండాలి. రాహుల్ గాంధీ అశోక్ నగర్ కి రావాలని డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి మగాడివైతే అశోక్ నగర్ కి రా. అక్కడ నిరుద్యోగుల చెబుతారు నీ పని. మీరిచ్చిన జాబ్ క్యాలెండర్ బోగస్. అందులో తరికులు తప్పా ఏమి లేదు.

Read more RELATED
Recommended to you

Latest news